అశోకగజపతి రాజు…టీడీపీ సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న వారిలో ఒకరు. అంతేగాదు ఎన్టీఆర్‌ను గద్దె దించి చంద్రబాబును సీఎం చేయడంలో అశోకుడిదే కీ రోల్. అయితే ఇదంతా గతం..ప్రస్తుతం ఆయన పరిస్థితి రివర్స్ అయింది. జనసేనలో పొత్తులో భాగంగా ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో అశోక గజపతిరాజుకు హ్యాండిచ్చారు బాబు. అయితే ఆయనకు కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే ఆయన కూతురుకు ఫస్ట్ లిస్ట్‌లో చోటు మాత్రం దక్కింది.
ఈసారి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు అశోక్. తన అభిప్రాయాన్ని చంద్రబాబుకు సైతం చెప్పారు. అయితే గజపతిరాజుకు కిమిడి ఫ్యామిలీ నుండి గట్టిపోటీ ఎదురవుతోంది. విజయనగరం ఎంపీ స్థానానికి కిమిడి నాగార్జున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు. అలాగే కిమిడి కళా వెంకటరావు పెద్దనాన్న అవుతారు. ఒకవేళ నాగార్జునకు కాకపోతే గేదెల శ్రీనివాస్‌కు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇక సామాజిక సమీకరణలను లెక్కలో వేసుకుంటే ఎమ్మెల్యే సీటు అశోక గజపతిరాజు కుమార్తెకు ఇచ్చారు కాబట్టి ఎంపీ సీటుని తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇవ్వబోతున్నట్లు టాక్. ఏదిఏమైనా ఈసారి అశోక గజపతిరాజుకు షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోందిని తెలుస్తోంది.