నా కులమే శాపమైంది..జనసేన నేత కంటతడి!

టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా పవన్ పార్టీకి చంద్రబాబు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే జనసేనలో టికెట్లు ఆశీంచి చాలా మంది నేతలు భంగపడ్డారు. టికెట్‌లు దక్కని నేతలంతా తిరుగుబాటు జెండా ఎగురవేయగా మరికొంతమంది పార్టీ కార్యాలయంలోనే జెండాలు తగలబెడుతున్నారు. అలాగే పవన్ తీరును తప్పుబడుతూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇక అనకాపల్లి టికెట్ ఆశీంచి భంగపడ్డ పరుచూరి భాస్కరరావు కార్యకర్తల సమావేశంలో కంటతడి పెట్టారు. తాను కాపు కులంలో పుట్టడం వల్లే సీటు రాలేదని కన్నీటిని ఆపుకోలేకపోయారు. అనకాపల్లిలో పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశానని…అయితే తన కులమే శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాస్కర్‌రావు అనుచరులు సైతం కన్నీటిని ఆపుకోలేకపోయారు.

అయితే పొత్తులో భాగంగా జనసేనకు సీటును కేటాయించింది టీడీపీ. అయితే పవన్ మాత్రం భాస్కరరావుకు కాకుండా కొణతాల రామకృష్ణకు సీటును కేటాయించారు. దీంతో తన కులమే శాపంగా మారిందని పవన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు భాస్కర్ రావు.