అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడు లాభ పడేది చంద్రబాబే!

చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ఏ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది లేదు. ఓసారి కమ్యూనిస్టులతో మరోసారి బీజేపీతో, చివరకు కాంగ్రెస్‌తో కూడా పొత్తుకు వెనుకాడలేదు చంద్రబాబు. అయితే సింగిల్‌గా మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే, ఇప్పుడు నవ్యాంధ్రలో అయినా పోటీ చేసింది లేదు. అయితే ఏ ఎన్నికల్లోనైనా పొత్తులో లాభపడేది చంద్రబాబే.

గతంలో జరిగిన ఎన్నికల రిజల్ట్స్‌ని గమనిస్తే ఇదే అర్ధమవుతుంది.తెలుగుదేశం ఎప్పుడూ మిత్రపక్షాలని మోసం చేస్తూనే ఉంటుంది. తెలుగుదేశం నుండి ఓటు ఎట్టిపరిస్థితులలో 100% ట్రాన్స్ఫర్ కాదు. ఉదాహరణకు తాడేపల్లిగూడెం లో 2009 లో టీడీపీ కి 41,282 , PRP కి 48,747 వస్తే BJP కి 771 ఓట్లు వచ్చాయి.,2014 లో బీజేపీ కి కేవలం 73,339 వచ్చాయి 90 వేలు పైగా రావలసిన ఓట్లు 73 వేలు మాత్రమే వచ్చాయి ,పైగా 13 వేలు కొత్త ఓట్లు పెరిగాయి …

పాడేరులో 2009 లో టీడీపీ బలపరచిన సిపిఐ కి 35,066 వస్తే PRP కి 16,894 వచ్చాయి బీజేపీ కి 3849 వచ్చాయి. ఇక 2014 లో బీజేపీకి కేవలం 17,029 వచ్చాయి.
2019 లో టీడీపీ కి 28,349 వచ్చాయి అంటే పొట్టులోఉన్న సిపిఐ కి 2009 లో బదలీ కాలేదు ..2014 లో బీజేపీ కి బదలీ కాలేదు ..2019 లోమాత్రం మళ్ళీ టీడీపీ ఓట్లు టీడీపీకి పడ్డాయి. వీటిని బట్టి చూస్తే పవన్ కూడా భీమవరం ఓడిపోవడం ఖాయం. అందులో సందేహమేమి లేదు. పవన్ గెలిస్తే లోకేష్ రాజకీయ జీవితానికి ఇబ్బంది కాబట్టి పవన్‌ని ఓడించడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.