హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా గురించి అప్డేట్ కోసం ఎప్పటినుండో అభిమానులు ఎదురుచూస్తుండగా ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొమోను ఈ నెల 19న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తన పాత్కకు సంబంధించిన డబ్బింగ్ పనులను పవన్ పూర్తి చేశారు.
పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందిమైత్రి మూవీ మేకర్స్. దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఫొటోలో ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా అషుతోశ్ రాణా, నవాబ్ షా, బీఎస్ అవినాశ్, గౌతమి కీలకపాత్ర పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇక సుజిత్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా త్వరలో గ్లింప్స్ రానుంది. అలాగే క్రిష్ – పవన్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు అప్ డేట్ కూడా రానుండటంతో పవన్ ఫ్యాన్స్కి పండగే కానుంది.