Monday, April 29, 2024
- Advertisement -

అభ్యర్థి ఎవరైనా..అనకాపల్లి వైసీపీదే!

- Advertisement -

ఏపీలో ఎలక్షన్ హీట్ తారాస్థాయికి చేరింది. ఇక ఎన్నికల రేసులో వైసీపీ ముందంజలో ఉండగా 175 అసెంబ్లీ,24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జగన్. ఇక టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పొత్తులో భాగంగా ఇవాళ బహిరంగసభలో మోడీ-పవన్-చంద్రబాబు కలిసి పాల్గొననున్నారు.

ఇక అన్ని పార్టీలకు ఒక స్థానం హాట్ కేక్‌గా మారిపోయింది. అదే అనకాపల్లి పార్లమెంట్. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి డాక్టర్ సత్యవతి వైసీపీ అభ్యర్థిగా గెలవగా ఈసారి మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు జగన్. ఇక కూటమి పొత్తులో భాగంగా టీడీపీ – జనసేన ఈ సీటును బీజేపీకి వదిలేయగా ఇక్కడి నుండి సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహరావు పోటీ పడుతున్నారు.వాస్తవానికి వీరిద్దరు నాన్ లోకలే.

ఇక వైసీపీ సిట్టింగ్ ఎంపీ సత్యవతికి పెద్దగా నెగటివ్ లేదు. దీనికి తోడు బీజేపీకి ఈ నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదు. బీజేపీ అభ్యర్థులు పూర్తిగా టీడీపీ, జనసేనల ప్రచారంపైనే ఆధారపడాల్సి ఉండటంతో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే కానుంది. ఇక ఉత్తరాంధ్రలో అనకాపల్లి అత్యంత కీలకం కానుండటంతో బీజేపీ, వైసీపీ తరపున అభ్యర్థులు ఎవరా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే అభ్యర్థి ఎవరైనా వైసీపీ విజయం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -