ఫస్ట్ మీటింగే ఫ్లాప్?

కాపురం చేసే కళ కాళ్ళుతొక్కినప్పుడే తెలుస్తుందని పెద్దలు ఊరకనే అనలేదు. ఆ సూక్తి ఇప్పుడు టీడీపీ…బీజేపీ..జనసేన కూటమి నిర్వహించిన మొదటి సభ తో నిజమని తెలుస్తోంది.మోడీ చంద్రబాబు..పవన్ పాల్గొన్న ఈ సభ అన్నివిధాలా భ్రష్టుపట్టింది.. ఏ విషయంలోనూ ఏ అంశంలోనూ ఏ విధంగానూ సభ ఆకట్టుకోలేదు..

ప్ర‌ధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్న‌ప్పుడు మ‌ధ్య‌లో ప‌లుమార్లు మైక్ క‌ట్ అయ్యింది. దేశం ప్రధాని మాట్లాడే సభలో మైక్ పనిచేయలేదంటే సభ పరిస్థితి ఎలా ఉందో అర్దమవుతోంది.సాధారణంగా ఎప్పుడూ జోకులు… చలోక్తులు, చమత్కారాలతో సరదాగా మాట్లాడే మోడీ ఈ సభలో మాత్రం అత్యంత సాదాసీదాగా మాట్లాడి మమ అనిపించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖాల్లో జోష్ కనిపించకపోగా అందరూ ముభావంగా ఉన్నారు.మోడి కూడా చంద్రబాబు, పవన్ ను గెలిపించమని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన ప్రసంగం అంతా లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది. కేంద్రంలో తమకు 400 సీట్లు ఇవ్వండి అని కోరారు తప్ప చంద్రబాబు గురించి ఏమీ చెప్పకపోవడం టిడిపీ..జనసేన శ్రేణులను పూర్తిగా నిస్తేజంలో ముంచేసింది..కూటమికి ఎక్కడలేని జోష్ తెస్తుందని ఆశించిన చంద్రబాబు అశలపై చిలకూలూరిపేట సభ నీళ్ళు జల్లింది.