ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.పార్టీ లు వేరయినా గమ్యం ఒక్కటే కావడంతో మహాకూటమిని ఏర్పాటు చేయాలని ఆదిశగా రజకీయాలు వెల్తున్నాయి.టీడీపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిమీదకు వచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
టీడీపీ తప్ప మిగితా పార్టీలన్ని ప్రత్యేకహోదాపై పోరాడుతున్నాయి కాబట్టి మహాకూటమిని ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.దీనికి వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
పవన్ జనసేన, వామపక్షాలతో కలిసి మహా కూటమి ఏర్పాటు చేస్తే తప్ప, తెలుగుదేశం పార్టీని 2019 లో ఓడించడం అసాధ్యమని వైకాపా నేత వైఎస్ జగన్ కు రాజకీయ సలహాదారు ప్రశాంత్ ఓ నివేదిక అందించారట. బీహార్ లో కూటమి విజయం సాధించింది. యుపిలో విఫలమయింది.అదే ఫార్ములాను ఏపీలో కూడా ఉపయేగించాలని చూస్తున్నారు.
{loadmodule mod_custom,GA2}
అయితే ఏపీలో మహా కూటమి అన్నది తెలుగునాట సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా జగన్-పవన్ కలవడం అన్నది కూడా కాస్త అసాధ్యమైన వ్యవహారమే. భావసారూప్యం వున్న వామపక్షాలే ఓ దరికి రావడంలేదు. పైగా పవన్ కళ్యాణ్ మోడీకి దూరంగా వున్నట్లు కనిపిస్తున్నారు కానీ, తెలుగుదేశం పార్టీకి కాదు. అందువల్ల జగన్ కు ఆయన దగ్గర కావడం అన్నది అనుమానమే.
ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పవన్ పై విమర్శల దాడి అన్నది ఎప్పుడూ చేయలేదు.అదే కనుక జగన్ వైపు పవన్ వెళ్తే ఈ దాడి ఓ రేంజ్ లో వుంటుంది. జగన్ కు సదా అంటిస్తూ వస్తున్న అవినీతి మరకను పవన్ కు పూసే ప్రయత్నం జరుగుతుంది. దానికి జంకి అయినా పవన్ అటు వెళ్లరు.బహుశా ప్రశాంత్ నివేదిక అన్నది కూడా ఈ పథకం ప్రకారం బయటకు వచ్చిందో, బయట ‘రచించిందో’ కూడా కావచ్చు.
ఎందుకంటే ఈ నివేదిక ప్రకారం తేదేపాను ఓడించాలి అంటే, పవన్, వామపక్షాలు, జగన్ కలవాలి. పవన్-జగన్-వామపక్షాలు-కాంగ్రెస్ కలవాలి. ఇది పూర్తిగా అసాధ్యం. కాంగ్రెస్ తో కలవకుండానే జగన్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటూ ఇప్పటికీ బదనామ్ చేస్తోంది తెలుగుదేశం. ఇది సాధ్యమయ్యేది కాదు.
{loadmodule mod_custom,GA1}
అదే సమయంలో వామపక్షాలను కూడా అన్ని ఉపాయాలు ఉపయోగించి, జగన్ కు దూరంగా వుంచే యత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందని వినికిడి.ఎలాగైనా వామపక్షాలను జనసేన దరికి చేర్చాలని ప్రయత్నం జరుగుతోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జనసేన రాజకీయాలు చేస్తోందట.
ఈ నివేదిక బయటకు రావడం వెనుక లేదా వెల్లడించడం వెనుక పరమార్థం ఒకటే కనిపిస్తోంది. తెలుగునాట ప్రతిపక్షాలు ముక్కులు ముక్కలుగా వున్నాయి. ఇవన్నీ కలిసి అధికార వ్యతిరేక ఓటును చీలుస్తాయి. దీంతో చంద్రబాబు సునాయాసంగా మళ్లీ అధికారం అందుకుంటారు.మరి ఏపీలో ఈమహాకూటమి సాధ్యమవుతుందా అన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మారింది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related