Sunday, May 5, 2024
- Advertisement -

జగన్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..

- Advertisement -
Prashant Kishore meet Ys Jagan Ycp Victory Confirm 2019

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల స‌మాచారంతో రాజ‌కీయ వేడి ఒక్క‌సారిగా వేడెక్కింది.ఇంకా రెండు సంత్స‌రాలు స‌మ‌యం ఉన్నా సీఎం  చంద్ర‌బాబునాయుడు  ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉండాల‌ని పార్టీశ్రేనుల‌కు పిలుపునిచ్చారు.ప్ర‌ధాని మోదీ  దేశంలో ఒకే సారి ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని భావిస్తుండ‌టంతో 2018లోనే ఎన్నిక‌లు రానున్నాయ‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.  కొత్త‌గా వ‌చ్చిని ప‌వ‌ణ్‌క‌ళ్యాన్ పార్టీ జ‌న‌సేన కూడా ఎన్నిక‌లు సిద్ద‌మేనన్న సంకేతాలు ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ క్షేత్ర‌స్థాయిలో పార్టీ నిర్మానమే జ‌ర‌గ‌లేదు.

క‌నీసం జిల్లా అధ్య‌క్షులును కూడా నియ‌మించ‌లేదు.మ‌రి ముంద‌స్తు ఎన్నిక‌లు టీడీపీ, జ‌న‌సేప పార్టీ సిద్ద‌మ‌వుతుండటంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన  వైసీపీకూడా అప్ర‌మ‌త్త‌మైంది.ముంద‌స్తు ఎన్నిల‌కు వైసీపీకూడా సిద్ధ‌మ‌నే బ‌ల‌మైన  సంకేతాలు పంపింది. మంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్య‌లో అన్ని అస్త్ర‌,శ‌స్త్రాలు సిద్దం చేసుకుంటోంది.దీనికోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాలిక‌ల‌ను రూపొందిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌లో కేవ‌లం 5 ల‌క్ష ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీని ద‌క్కించుకోవాల‌ని ప‌క‌డ్బందీ ప్ర‌ణాలిక‌లు సిద్దం చేస్తోంది. ఇప్ప‌టికే  జిల్లాలో పార్టీనీ బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించారు. ఇత‌ర పార్టీల‌లో ఉన్న బ‌ల‌మైన సామాజిక వ‌ర్గ‌నాయ‌కుల‌ను పార్టీలోకి  ఆహ్వానిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వెల్లిన నాయ‌కుల స్థానంలో ద్వితీయ శ్రేని నాయ‌కుల‌పై కూడా జ‌గ‌న్ దృష్టిసారించారు.

చంద్ర‌బాబునాయిడిని ఎదుర్కోవాలంటే  అందుకు త‌గ్గ వ్యూహాలును అమ‌లు చేయాలి. అలాంటి వ్యూహాలు అమ‌లుచేయ‌డంతో రాజ‌కీయ ప‌రిశీల‌కుడిగా,ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిశోర్ కు దేశ‌లో మంచి పేరుంది.ఆయ‌న సేవ‌ల్ని వినియేగించుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయానికి ప్ర‌ముఖ పాత్ర పోషించాడు.ప్ర‌శాంత్‌కిషోర్ సోషియ‌ల్ మీడియాను ఉప‌యేగిం వ్యూహాలు ర‌చించ‌డంలో దిట్ట‌. ఏయే నియేజ‌క వ‌ర్గాల్లో పార్టీ , అభ్య‌ర్తులు బ‌ల‌హీనంగా ఉన్నార‌నేది ముందుగానే అంచ‌నావేసి అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌ణాలిక‌లు రూపొందిస్తారు.

2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయానికి కృషి చేసిన రాజకీయ వ్యూహకర్త. అనంతరం 2015లో జరిగిన బీహార్ ఎన్నికల్లో  జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి బీహార్ ఎన్నికల్లో విజయం సాధించడం వెనుక ఉన్న వ్యక్తి. ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పంజాబ్ లో గెలవడం వెనక కూడా ప్రశాంత్ వ్యూహం ఉంది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఎన్నికల వ్యూహకర్తను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

ఇప్ప‌టికే మూడు సంవత్సరాల  టీడీపీ పాల‌న‌పై  ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెర‌గ‌డంతోపాటు….ఇటు వైసీపీకీ ఆద‌ర‌న పెరుగుతోంది. ఇక 2019లో జ‌రిగే ఎన‌నిక‌ల్లో గెలిచే ఏఅవ‌కాశాన్ని వ‌దుల‌కోకూడ‌ద‌ని జ‌గ‌న్ వ్యూహంతో ఉన్నారు. అందుకే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ సేవ‌ల‌ను వినియేగించుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. ఇప్ప‌టికే వీరి భేటీలో అన్ని అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం త‌ధ్య‌మ‌ని ఆపార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రాష్ట్ర రాజ‌కీయాల‌లో తీవ్ర ఉత్వంఠ‌…వైసీపీ శ్రేనులలో ఆందోళ‌న‌
  2. అబద్దపు కథనాలు ప్రసారం పై ABNకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రవికిరణ్
  3. ఈనెల 28కి తీర్పును రిజ‌ర్వ్ చేసిన సీబీఐ కోర్టు
  4. టీడీపీకి మరో షాక్.. అనంతలో వైసీపీకి 2019లో విజయం ఖాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -