టీడీపీ -జనసేన – బీజేపీ జట్టుగా ఈసారి ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ, జనసేన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించగా జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇప్పటివరకు 20 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన. ఒక పాలకొండ స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది.
అయితే తాజాగా పాలకొండ అభ్యర్థి కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీని వీడి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణను బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
2014 , 2019లో పాలకొండ నుండి పోటీ చేసిన జయప్రసాద్…వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే రైల్వేకోడూరు (ఎస్సీ) స్థానం అభ్యర్థిని మార్చింది జనసేన. తొలుత యనమల భాస్కర్‌ను అభ్యర్థిగా ప్రకటించగా తాజాగా అరవ శ్రీధర్ పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
