Tuesday, April 30, 2024
- Advertisement -

పులివెందుల..ఈసారి లక్ష మెజార్టీ!

- Advertisement -

పులివెందుల..తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైఎప్ ఫ్యామిలీకి కంచుకోట ఈ నియోజకవర్గం. కడప లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్న పులివెందుల ప్రతి గడప వైఎస్ కుటుంబానికి పరిచయమే. ఈ నియోజక వర్గం పరిధిలో చక్రాయపేట,తొండూరు,పులివెందుల,లింగాల,వేముల,వేంపల్లె,సింహాద్రిపురం ఉన్నాయి.

1955లో ఈ నియోజకవర్గం ఏర్పడగా ఒక్క 1962 మినహా కాంగ్రెస్ పార్టీని మెజార్టీ సార్లు విజయం సధించింది. 1978 నుండి ఇక్కడ వైఎస్ కుటుంబ సభ్యులే విజయం సాధిస్తూ వస్తున్నారు. వైఎస్‌ఆర్ 6 సార్లు,వైఎస్ వివేకా రెండు సార్లు,వైఎస్ పురుషోత్తం రెడ్డి,వైఎస్ విజయమ్మ ఒకసారి విజయం సాధించాయి.ఇక 2014,2019లో వైఎస్ జగన్ విజయం సాధించారు. 2004,2009లో వైఎస్ గెలిచి ముఖ్యమంత్రి కాగా 2019లో జగన్ పులివెందుల నుండే గెలిచి సీఎం అయ్యారు.

తాజాగా పులివెందుల బరిలో జగన్ మూడో సారి బరిలో నిలవగా గత ఎన్నికల్లో జగన్‌పై పోటీ చేసిన సతీష్ వైసీపీ గూటికి చేరిపోయారు. టీడీపీ తరపున బిటెక్ రవి పోటీ చేస్తుండగా జగన్ గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

2019లో పులివెందులలో 1,80,217 ఓట్లు పోలవ్వగా జగన్‌కు 1,32,356 ఓట్లు రాగా టీడీపీ తరపున పోటీ చేసిన సతీష్ కు 42,246 ఓట్లు వచ్చాయి. జగన్‌కు 90,110 మెజార్టీ రాగా ఈ సారి లక్ష మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -