Thursday, May 16, 2024
- Advertisement -

రెబల్ సెగ..టీడీపీ అభ్యర్థులకు కష్టమే!

- Advertisement -

టీడీపీ అభ్యర్థులకు రెబల్ ట్రబల్ తప్పడం లేదు. కీలక నేతల నియోజకవర్గాల్లో టికెట్లు ఆశీంచి భంగపడ్డ నేతలు తగ్గెదేలే అంటూ ఇండిపెండెంట్‌లుగా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉండి నియోజకవర్గంలో అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది.

మన ఉండి మన ఎమ్మెల్యే అంటూ తెలుగు తమ్ముళ్లు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అభ్యర్థులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేని చంద్రబాబు.. పేదలకు పథకాలు ఇస్తామంటే ఎలా నమ్ముతారిన ప్రశ్నించారు.

పాడేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అలాగే అరకులో మరో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సివేరి అబ్రహం రెడీ కాగా మాడుగుల నియోజకవర్గంలోనూ ఇదే సిచ్యువేషన్. పైలా ప్రసాద్‌ను తప్పించాలని గవిరెడ్డి రామానాయుడు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తెలిపారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో టీడీపీ నేతలకు రెబల్స్ ట్రబుల్ తో ఓటమి ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -