ధర్మం కోసం యుద్ధమంటున్న పవన్!

శ్రీరామనవమి సందర్భంగా పవన్ కళ్యాణ్ – క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఒకటి హరిహర వీరమల్లు. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో త్వరలో టీజర్ రానుందని వెల్లడించారు.

ఇక ఈ పోస్టర్‌లో కత్తి పట్టుకొని పవన్ పవర్ ఫుల్ కళ్ళతో చూస్తున్నట్టు ఉండగా ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ ఇచ్చారు. అంతేగాదు సర్‌ప్రైజ్ పోస్టర్‌లో టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వగా ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హరిహర వీరమల్లుతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు చేస్తున్నారు పవన్‌. ఇక హరిహరి వీరమల్లు పవన్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా మావీ. దీంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో బిజీగా ఉన్నారు పవన్. ఎన్నికలు పూర్తి కాగానే తన సినిమాలో దృష్టి సారించే అవకాశం ఉంది.