Tuesday, April 30, 2024
- Advertisement -

గురిజాల…హోరాహోరి పోరేనా!

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇక ఏపీలోని హైవోల్టేజీ నియోజకవర్గాల్లో ఒకటి గురజాల. వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుండి ఆ పార్టీ సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు బరిలో నిలిచారు.

1952 గురిజాల నియోజకవర్గం ఏర్పడగా గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన కాసు…అత్యధిక మెజార్టీని సాధించారు. గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం నేతలు సైతం వైసీపీకి జై కొట్టారు. ఈసారి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ నియెజకవర్గంలో కాంగ్రెస్ సైతం బరిలో ఉండటంతో ఏపార్టీ ఓట్లు చీలుతాయోనని ఉత్కంఠ నెలకొంది. ఇక జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయనే ధీమాలో ఉన్నారు కాసు మహేష్. అయితే సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి చేరిక తనను గెలిపిస్తుందని టీడీపీ అభ్యర్థి యరపతినేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హోరాహోరీగా సాగుతున్న గురిజాల పోరులో ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -