జనసేనకు మరో షాక్..వైసీపీలోకి కీలక నేతలు

ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరగా తాజాగా విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నేతలు గంపల గిరిధర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. గిరిధర్‌తో పాటు జి. శ్రీజ, జి. ధనుష్‌, ఎన్. శ్రీనివాస్ తదితరులు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

భీమిలి నియోజకవర్గానికి చెందిన జనసేన నేత విద్యావేత్త అలీవర్ రాజు రాయ్ కూడా వైసీపీలో చేరారు. శంకర్ ఫౌండేషన్ ట్రస్టీ కృష్ణ కుమార్,టీడీపీ నేత,ఉడా మాజీ డైరెక్టర్ భారతి,చరణ్‌, సందీప్, దాపు వైసీపీలో చేరారు.