పవన్‌కు నటుడు నరేష్ పంచ్

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్‌స్టార్ కృష్ణ పేరును పవన్ కళ్యాణ్ తీసుకురావడంపై తనదైన శైలీలో స్పందించారు నటుడు నరేష్.సీనియర్‌ ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణ..రాజకీయ విమర్శలు చేసేవారని కానీ ఒక్కసారి కూడా ఎన్టీఆర్ ప్రతీకారం తీర్చుకోలేదని, ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించలేదని వ్యాఖ్యానించారు పవన్.

దీనిపై స్పందించిన నరేష్‌… పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణ ని విమర్శించడం చూసి నేను షాక్ అయ్యాను, చాలా బాధపడ్డాను అని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన నరేష్‌… నిజాయితీ,నైతికతకు మారుపేరు కృష్ణ అన్నారు. కృష్ణ ఉత్తమ పార్లమెంటేరియన్‌, సినిమా పరిశ్రమకు, రాజకీయాలకు ఆయన చేసిన కృషి ఎనలేనిది అని కొనియాడారు.

తన రాజకీయ ప్రసంగాల్లో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని కాబట్టి ప్రచారంలో ఆయన పేరు ఎత్తడం సబబు కాదని పవన్‌కు హితవు పలికారు. మరి దీనిపై జనసేనాని ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.