Saturday, May 10, 2025
- Advertisement -

చీరాలలో త్రిముఖ పోరేనా?

- Advertisement -

ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో గెలుపు ఎవరిది..?రాష్ట్రంలో ఇక్కడా లేని విధంగా ఇక్కడ త్రిముఖ పోరు జరిగిందా? చీరాల స్థానాన్ని నిలబెట్టుకునేది ఎవరు? ఇప్పుడు ఇదే చర్చ స్థానికంగా జరుగుతోంది.

వైసీపీ నుండి కరణం వెంకటేష్, టీడీపీ నుండి కొండయ్య,కాంగ్రెస్ నుండి ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే 2009,2014లో గెలిచిన ఆమంచి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఆమంచి..కాంగ్రెస్ నుండి పోటీ చేస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి ఎజెండా వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, టీడీపీ అభ్యర్థి కూటమి ఇచ్చిన హామీలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకు సాగింది. అయితే కాంగ్రెస్ నుండి ఆమంచి ఎంట్రీ ఇవ్వడంతో ఇది ఎవరి గెలుపుపై ప్రభావం చూపుతుందోనన్న చర్చజరుగుతుండగా గెలుపు తీరాన్ని చేరేది ఎవరనేది మరో ఆరు రోజుల్లో తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -