Saturday, May 10, 2025
- Advertisement -

ఏపీ తొలి ఫలితం అక్కడే!

- Advertisement -

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 33 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు చేపట్టనున్నారు. ఇక తొలి ఫలితం నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెలువడనుంది. 13 రౌండ్లలో ఇక్కడ ఫలితం వెల్లడికానుండగా రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో చివరిగా ఫలితం రానుంది.

రాత్రి 9 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉండగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో 13 రౌండ్ల‌లో ఫలితం లేతిపోనుంది.

ప్రతీ కౌంటింగ్ కేంద్రంలో సీసీ టీవీల ద్వారా పర్యవేక్షణ చేయనుండగా 144 సెక్షన్ అమల్లో ఉంది. రాష్ట్రంలో 45 వేల మంది పోలీసులు అన్ని చోట్లా ఎన్నికల విధుల్లో ఉండనుండగా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతిలేదని పోలీసులు తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -