Sunday, May 11, 2025
- Advertisement -

మంచి చేసినా ఓడాం:రోజా

- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీకి 45 శాతం ఓట్లు రాగా వైసీపీకి 40 శాతం ప్రజలు మద్దతుగా నిలిచారు. అయితే సీట్ల సంఖ్యలో మాత్రం భారీగా తేడా కనిపించింది. వైసీపీకి 11 సీట్లు రాగా కూటమికి 164 సీట్లు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమిపై స్పందించారు మాజీ మంత్రి రోజా. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం.. ఈ విషయంలో ఎందుకు సిగ్గుపడాలని ఎక్స్ ద్వారా ప్రశ్నించారు. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని తన మార్క్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రోజా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -