- Advertisement -

ఎయిర్ బ్యాగ్ తెరుచుకున్న‌ద‌క్క‌ని ప్రాణం… అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణమా…?

- Advertisement -
Ravi Teja’s brother Bharath Raj dies in Rood Accdent

గత రాత్రి ఔటర్ రింగురోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు, నటుడు భరత్ రాజు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం గురించిన మరింత సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం సమయంలో భరత్ ఒంటరిగా కారును నడుపుకుంటూ వచ్చారని తెలిపారు.

రోడ్డు పక్కన బ్రేక్ ఫెయిల్ అయిన లారీ ఆగివుండగా, హెచ్చరికగా లారీ వెనుక చెట్టు కొమ్మలను సైతం అమర్చారని, దాన్ని గుర్తించకపోవడమే ప్రమాదానికి కారణమని అన్నారు. రవితేజ తల్లి రాజ్యలక్ష్మి ‘టీఎస్ 09 ఈసీ 0799’ నంబరుతో కారు రిజిస్టరై ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ప్రమాదం తరువాత కారులోని ఎయిర్ బ్యాగులు తెరచుకున్నాయని, అధిక వేగం కారణంగా, కారు ముందు భాగం మొత్తం లారీ వెనక చక్రాల కింద వరకూ దూసుకెళ్లడంతో భరత్ మృతదేహం గుర్తించలేని విధంగా ఛిద్రమైందని అన్నారు.

{loadmodule mod_custom,GA1}

ఔటర్ రింగురోడ్డుపై గత రాత్రి రవితేజ సోదరుడు భరత్ రాజు ప్రయాణిస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరుగగా, ఈ విషయాన్ని ఉదయం వరకూ అతని స్నేహితులు రహస్యంగా ఉంచారు. ఉదయం కారు ప్రమాదం గురించిన సమాచారాన్ని ఇతరుల నుంచి తెలుసుకున్న పోలీసులు 10:30 గంటల సమయంలో ఘటనాస్థలికి వెళ్లిన తరువాతే మృతుడు భరత్ రాజుగా గుర్తించారు. ప్రమాద విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్న విషయమై విచారణ జరుపుతామని, రాత్రి ప్రమాదం జరిగితే, ఉదయం వరకూ ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న విషయమై అతని స్నేహితులను ప్రశ్నిస్తామని తెలిపారు.

{loadmodule mod_custom,GA2}

కాగా, భరత్ వెంకీ, రెడీ, దూకుడూ, ఆ ముగ్గురూ, రామ రామ కృష్ణ కృష్ణ, జంప్ జిలానీ, చక్రి, అతడే ఒక సైన్యం తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరెన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}yNFJ_R9Da7w{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -