- Advertisement -

India A:కెప్టెన్‌గా శ్రేయాస్‌

- Advertisement -

ఆస్ట్రేలియా A జట్టుతో జరగనున్న నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో 15 మందితో కూడిన ఇండియా A జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్ సెప్టెంబర్ 16న లక్నోలో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 23న మొదలయ్యే రెండో మ్యాచ్‌కు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ జట్టులో చేరనున్నారు.

ఆసియా కప్ (సెప్టెంబర్ 9న యుఏఈలో ప్రారంభం) కోసం ప్రకటించిన భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు లభించలేదు. ప్రస్తుతం శ్రేయాస్ బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో వెస్ట్ జోన్ తరఫున సెంట్రల్ జోన్‌పై ఆడుతున్నారు. ధ్రువ్ జురేల్ వైస్ కెప్టెన్‌గా, అలాగే వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నారు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వర్‌న్, దేవదత్ పడిక్కల్‌తో పాటు, యువ ప్రతిభావంతులు సాయి సుధర్షన్, ఆయుష్ బదోని కూడా ఉన్నారు.

బౌలింగ్ విభాగాన్ని ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ నడిపిస్తారు. వారికి తోడుగా స్పిన్నర్లు హర్ష్ దుబే, తనుష్ కోటియన్, మనవ్ సుతార్ ఉన్నారు. జట్టులో ఆల్‌రౌండర్ నితిష్ కుమార్ రెడ్డి, లెగ్ స్పిన్నర్ గుర్నూర్ బ్రార్ కూడా ఉన్నారు. రెండు మ్యాచ్‌లూ లక్నోలోనే జరుగుతాయి.

ఇండియా A జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వర్‌న్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుధర్షన్, ధ్రువ్ జురేల్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దుబే, ఆయుష్ బడోని, నితిష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మనవ్ సుతార్, యశ్ ఠాకూర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -