- Advertisement -

‘ఆరి’… మూవీ రివ్యూ

- Advertisement -

పేపర్ బాయ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఈ సినిమా తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని ఆరి వంటి అద్భుత కథతో ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, ‘సురభి’ ప్రభావతి, అనసూయ, వినోద్ వర్మ, హర్ష చెముడు ప్రధానపాత్ర పోషించగా ఆరితో జయశంకర్ హిట్ కొట్టాడా లేదా చూద్దాం..

కథ:

ఓ హోటల్‌లో టీ మాస్టర్ అమూల్ కుమార్ (హర్ష చెముడు)కు సన్నీ లియోన్ అంటే మోజు. ఆమెతో ఒక్క రాత్రి గడపాలని అతని కోరిక. ఎయిర్ హోస్టెస్ ఆత్రేయి (అనసూయ)కు తన సహ ఉద్యోగి మీద అసూయ. ఎప్పటికీ తాను అందంగా ఉండాలని కోరుకుంటుంది. కుటుంబీకుల ఆస్తి తన సొంతం కావాలనే దురాశతో గుంజన్ (శుభలేఖ సుధాకర్), నిధి అన్వేషణలో ఆగ్రహ జ్వాలతో రగిలే సీఐ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్), మరణించిన భర్తను మళ్ళీ బ్రతికించాలనే మోహంతో లక్ష్మి ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కోరిక ఉంటుంది. తమ కోరికలు తీర్చుకునేందుకు ఆ ఆరుగురూ ఎలాంటి పనులకు సిద్ధపడ్డారు? కోరికలు తీరుస్తానని చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? అరిషడ్వర్గాలను జయించే మార్గం ఏమిటి? అన్నదే ఈ సినిమా యొక్క ప్రధాన కథాంశం.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, స్క్రీన్ ప్లే. కామ క్రోధ మధ మోహన లోభ మాత్సర్యాలు మనిషి జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతాయో చక్కటి ఉదాహరణలతో చూపించాడు దర్శకుడు. కాన్సెప్ట్ తో పాటు తాను అనుకున్న కథను తెరపై చక్కగా చూపించారు జయశంకర్ . ఒక్కో పాత్ర పరిచయం, సన్నివేశాలు ఆసక్తిగా అనిపించాయి. నటనతో మాత్రమే కాదు… డైలాగ్ డెలివరీతోనూ విప్రనారాయణ పాశ్వాన్ పాత్రకు సాయి కుమార్ ప్రాణం పోశారు.

మైనస్ పాయింట్స్‌:

కథను క్లుప్తంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డా… చివరకు మంచి సందేశం ఇచ్చారు.

సాంకేతిక విభాగం:

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. ఈ చిత్రానికి సంగీతం, కెమెరా, మరియు వీఎఫ్ఎక్స్ ప్రధాన బలాలు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ఆర్.ఆర్. సినిమా మూడ్‌కు తగ్గట్టుగా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. సందేశాత్మక చిత్రాన్ని ధైర్యంగా నిర్మించిన నిర్మాతల కృషి ప్రశంసనీయం.

తీర్పు:

తెలుగు తెరపై ఇప్పటి వరకు రానటువంటి అరిషడ్వార్గాలు కాన్సెప్ట్ తీసుకుని దర్శకుడు జయశంకర్ చేసిన ప్రయత్నం ‘అరి: మై నేమ్ ఈజ్ నోబడీ’. కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే చిత్రం అరి.

రేటింగ్‌: 3/5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -