- Advertisement -

‘ఆరి’ జయశంకర్‌కు కేంద్రమంత్రి కితాబు

- Advertisement -

సినిమాలో కంటెంట్ ఉంటే ఆదరిస్తారని మరో చిన్న సినిమా నిరూపించింది. పేపర్ బాయ్ తో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు జయశంకర్. తొలి సినిమాతోనే క్లాసిక్ హిట్ కొట్టిన జయశంకర్ దాదాపు ఏడేళ్ల తర్వాత ఆరి అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు.

నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది.

తాజాగా ఆరి సినిమా దర్శకుడిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు గుప్పించారు. జయశంకర్ ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కింది అని కొనియాడారు కిషన్ రెడ్డి. సినిమా బాగుందని కితాబిచ్చారు.

బలమైన కథ, కథనం మరియు ప్రేక్షకుల మనసును తాకే సందేశం ప్లస్ పాయింట్స్‌గా మిగిలాయి. ప్రధానంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, ఆసక్తికరంగా వెండితెరపై చూపెట్టగలిగారు దర్శకుడు జయశంకర్. దీనికి తోడు నటీనటుల ఎంపిక సైతం సినిమాకు కలిసి వచ్చింది. అనూప్ రూబెన్ అందించిన సంగీతం,వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటుల పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాలోని మాటలు, పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -