- Advertisement -

టీ20లకు కేన్ గుడ్‌ బై

- Advertisement -

ఎట్టకేలకు టీ20లకు గుడ్ బై చెప్పారు న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌. ప్రస్తుతం కేన్ వయస్సు 35 ఏళ్లు. 93 టీ20 మ్యాచ్‌లు ఆడాడు కేన్. న్యూజిలాండ్ తరఫున పురుషుల టీ20లలో రెండవ అత్యధిక రన్స్‌ స్కోరర్‌గా నిలిచారు. మొత్తం 2575 పరుగులు సాధించిన ఆయన సగటు 33, అందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 95 పరుగులు.

2011లో అరంగేట్రం చేసిన విలియమ్సన్, మొత్తం 93 మ్యాచ్‌లలో 75 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇందులో న్యూజిలాండ్‌ను రెండు సెమీఫైనల్స్‌ (2016, 2022) మరియు ఒక ఫైనల్‌ (2021) వరకు నడిపించారు.

ఈ సందర్భంగా కేన్ మాట్లాడుతూ..ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఆ జ్ఞాపకాలు, అనుభవాలకు నేను ఎంతో కృతజ్ఞుడిని. నా కోసం, అలాగే జట్టుకూ ఇది సరైన సమయం. రాబోయే సిరీస్‌లకు, ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌ దిశగా జట్టుకు స్పష్టత కలిగించడానికీ ఇది సరైన నిర్ణయం అని వెల్లడించాడు. మన దగ్గర ఎంతో ప్రతిభావంతమైన టీ20 ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు వారిని మరింత అభివృద్ధి చేసే సమయం. మిచ్ (మిచెల్ సాంట్నర్) ఒక అద్భుతమైన నాయకుడు, ఈ జట్టుతో అతను చాలా ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో బ్లాక్‌క్యాప్స్‌ను ముందుకు నడిపించాల్సింది వారి సమయం. నేను దూరం నుంచైనా ఎల్లప్పుడూ వారికి మద్దతుగా ఉంటాను అని తెలిపాడు కేన్. న్యూజిలాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడుగా కేన్ విలియమ్సన్ రికార్డు దక్కించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -