చంద్రబాబు, లోకేష్ కు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం కేసు సీబీఐకి అప్పగించాలి అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్. నకిలీ మద్యం కేసులో మా ప్రమేయం లేదు అన్నారు.
కక్ష సాధింపులో భాగంగానే అక్రమ అరెస్టులు చేశారని… గత ఏడాది నన్ను, ఇప్పుడు నా తండ్రిని అరెస్టు చేశారు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అరెస్టులు..
అక్రమ అరెస్టులు ఎల్లకాలం సాగవని ప్రభుత్వ పెద్దలు గుర్తు పెట్టుకుంటే మంచిది అన్నారు.
చంద్రబాబు కక్ష గట్టి నన్ను అక్రమంగా అరెస్టు చేశారు…నకిలీ మద్యం కేసుతో నాకు సంబంధం లేదని భార్యా బిడ్డల సాక్షిగా కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేశాను అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్ట అన్నారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైసీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు..
టీడీపీ నేతలు సిండికేట్ గా ఏర్పడి రాష్ట్రంలో కల్తీ మద్యం దందా చేస్తున్నారు అన్నారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యాన్ని బయటపెట్టిందే జోగి రమేష్… టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ అరెస్ట్ అన్నారు. జనార్థన్ రావు, ఆయన భార్యా పిల్లలను భయపెట్టి తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించారు అన్నారు.
