రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా SSMB29 వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా శరవేగంగా సాగిన షూటింగ్ బాహుబలి రీ రిలీజ్ తో బ్రేక్ పడింది.
ఇక ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు నెక్ట్స్ ప్రాజెక్టు పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్పిరిట్ అయిన వెంటనే మహేష్‌తో ఓ సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతున్నట్లు టాక్ బలంగా వినిపిస్తుంది.
ఈ ఇద్దరు కలసి చేయబోయే సినిమా మాఫియా డాన్ నేపథ్యంలో ఉండబోతుందనే టాక్ నడుస్తుంది. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా స్టార్ట్ చేసే లోపే మహష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రెడీగా పెట్టుకోవాలని అనుకుంటున్నాడట సందీప్. మహేష్ కూడా SSMB29 తర్వాత ఏం చేయాలి అని ఇంకా ఏ సినిమా ఓకే చేయలేదు. సందీప్ రెడ్డి వంగతో మహేష్ సినిమాకు ఓకే చెప్పడాని తెలుస్తోండగా దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
