- Advertisement -

కేటీఆర్‌కు బిగ్ షాక్…ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి

- Advertisement -

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఫార్ములా ఈ రేస్ కేసులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను ప్రాసిక్యూట్ (Prosecute) చేసేందుకు గవర్నర్ నుంచి అవినీతి నిరోధక శాఖ (ACB) అనుమతి పొందింది.

కేటీఆర్ ఒక ప్రజాప్రతినిధి కావడంతో, ఆయనపై అభియోగాలు (charges) మోపడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై ACB కేసు నమోదు చేసింది. ఆ తర్వాత, కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 9న గవర్నర్‌కు లేఖ రాసింది.

సుమారు 70 రోజుల తర్వాత, గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఇప్పుడు ACB ..కేటీఆర్‌పై అభియోగాలు (charges) మోపడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కేసులో ACB చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయనుంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -