ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌కు రాకతో పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు తరలివచ్చి, ఆయనకు ఉత్సాహంగా స్వాగతం పలికారు.
“జై జగన్” నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌తో పాటు నడిచారు. జగన్ పర్యటన కారణంగా గన్నవరం మరియు బేగంపేట్ విమానాశ్రయాల వద్ద సందడి నెలకొంది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో, జగన్ ముందుకు కదులుతూ వారికి అభివాదం చేశారు. అనంతరం, ఆయన కాన్వాయ్ భారీ ర్యాలీగా నాంపల్లి వైపు సాగింది.
ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వై.ఎస్. జగన్, నేటి షెడ్యూల్లో భాగంగా నాంపల్లిలోని CBI కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన రాక సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కోర్టు ప్రాంగణం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టుకు వెళ్లే రెండు దారులను తమ ఆధీనంలోకి తీసుకుని, న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతించారు.కోర్టు ప్రక్రియ పూర్తయిన తర్వాత, జగన్ లోటస్ పాండ్‌కు బయలుదేరారు. అభిమానులు, పార్టీ నేతలతో సెల్ఫీలు దిగారు.
