- Advertisement -

ఐటీ రైడ్స్‌..భారీగా బంగారం పట్టవేత!

- Advertisement -

హైదరాబాద్‌లోని పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ హోటల్స్, రెస్టారెంట్లలో రెండు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో రూ.20 కోట్ల నగదు, భారీగా బంగారం పట్టుకున్నారు అధికారులు. ఆదాయ పన్ను శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్ కాలనీలోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లతో పాటు షాగౌస్, మెహ్ ఫిల్ చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. లక్డీకాపూల్, షేక్‌పేట్, అత్తాపూర్, టోలీచౌకి, గచ్చిబౌలి సహా గ్రేటర్ హైదరాబాద్‌లోని మొత్తం 30 ప్రాంతాల్లో రెండు రోజులుగా జరుగుతున్నాయి సోదాలు.

దాదాపు 20 కోట్ల రూపాయల నగదు, భారీగా బంగారం పట్టుబడినట్లు తెలిసింది. వీటితోపాటు వర్కర్ల పేర్లతో ఉన్న బినామీ ఆస్తుల డాక్యుమెంట్లు సహా కీలక పత్రాలు, పలువురి పేరున బ్యాంకు లాకర్లను గుర్తించారు అధికారులు. బ్లాక్ మనీని హవాలా రూపంలో దారిమళ్లించినట్లుగా గుర్తించినట్టు సమాచారం. ఇవాళ కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -