- Advertisement -

‘దే దే ప్యార్ దే 2’ మూవీపై రకుల్!

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ తన చిత్రం దే దే ప్యార్ దే 2 షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న అత్యంత కఠిన పరిస్థితులను వెల్లడించారు. సినిమా షూట్‌లో సగం పూర్తిచేసిన వెంటనే, వర్కౌట్ సమయంలో ఆమెకు తీవ్రమైన వెన్నెముక గాయం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది.

“దే దే ప్యార్ దే 2 షూటింగ్ సమయంలో నాకు స్పైన్ ఇంజరీ అయింది. సినిమా 50% పూర్తి చేశాక ఈ గాయం అయ్యింది. 40 రోజులపాటు మంచానికే పరిమితమయ్యాను. మళ్లీ ఎప్పుడు నడుస్తానో, నిలబడగలనో కూడా అర్థం కాకుండా కూరగాయలా ఉండిపోయాను అని చెప్పారు.

తీవ్ర నొప్పి కారణంగా ఆమె కదలలేని స్థితికి చేరుకోవడంతో, షూటింగ్‌ను మూడు నెలలు నిలిపివేయాల్సి వచ్చింది. పూర్తిగా కోలుకోకముందే షూటింగ్‌కు తిరిగి వెళ్లిన రాకుల్‌కు సెట్స్‌లో పని చేయడం చాలా కష్టంగా మారింది. తిరిగి షూట్ ప్రారంభించాక నేను కుర్చీ మీద కూడా కూర్చోలేకపోయాను. ఫిజియో బెడ్‌పైనే సగం సినిమా షూట్ చేశాను. స్క్రీన్‌పై అది కనిపించదు అని ఆమె తెలిపారు.

దే దే ప్యార్ దే 2 షూట్ సమయంలో రాకుల్‌కు తీవ్రమైన స్పైన్ ఇంజరీ కావడంతో 40 రోజులపాటు మంచానికే పరిమితమయ్యారు. సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. పూర్తి శక్తి, కదలిక తిరిగి రావడానికి ఆమెకు దాదాపు ఒక ఏడాది పట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -