- Advertisement -

సూర్య-వెంకీ..ఇంట్రెస్టింగ్ న్యూస్!

- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్య ….దర్శకుడు వెంకీ అట్లూరి వినిపించిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం మొదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

దీనికి ప్రధాన కారణం వెంకీ అట్లూరి గతంలో తెరకెక్కించిన సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించడమే. అందుకే ఈ సూర్య–వెంకీ కాంబినేషన్ కూడా తప్పకుండా హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. అయితే, సినిమా టైటిల్ విషయంలో మాత్రం చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా, యూనివర్సల్ అపీల్ ఉన్న టైటిల్‌ను దర్శకుడు ఎంపిక చేశాడని టాక్.

మమిత బైజు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా సూర్య హిట్ కొడతాడా లేదా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -