- Advertisement -

రేటు పెంచేసిన వెంకీ..ఎంతో తెలుసా!

- Advertisement -

వరుస హిట్ సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు విక్టరీ వెంకటేష్. హీరోగా మాత్రమే కాకుండా, గెస్ట్ అప్పియరెన్స్‌గా చేసిన చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్ విజయాలు సాధిస్తూ ఆయన క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్తున్నాయి. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ భారీ బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, సంక్రాంతి సీజన్‌లో విడుదలై రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మరో భారీ చిత్రం ద్వారా కూడా వెంకటేష్ సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వగా, ఆ సినిమా రూ.350 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్‌లో రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇలా హీరోగా మాత్రమే కాకుండా అతిథి పాత్రలతో కూడా విజయాలు అందుకోవడం వెంకటేష్ స్థాయిని మరింత పెంచింది.

ఈ వరుస విజయాల ప్రభావంతో వెంకటేష్ తన తదుపరి సినిమాకు రెమ్యునరేషన్‌ను పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన, ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం ఆ మొత్తాన్ని డబుల్ చేసి రూ.20 కోట్లు తీసుకుంటున్నారట. ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వెంకటేష్ ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్‌తో ఆదర్శ కుటుంబం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -