- Advertisement -

యష్..’టాక్సిక్’ స్టోరీ లీక్?

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం గీతూ మోహన్‌దాస్ వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. 1940ల ప్రారంభం నుంచి 1970ల మధ్యకాలంలో గోవా నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందిందని తెలుస్తోంది. హింస, ద్రోహం, భయంతో నిర్మితమైన క్రైమ్ సామ్రాజ్యం ఎదుగుదలను, అలాగే మనసులోని అనుమానాలు, మానసిక సంఘర్షణలను ఈ కథలో చూపించనున్నట్లు సమాచారం.

అయితే దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. యష్ సరసన కియారా అద్వాని, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ కె నారాయణ మరియు యష్ కలిసి KVN ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -