- Advertisement -

రాజ్యసభ షెడ్యూల్..ఉన్నవి రెండు..ఆశిస్తున్న నేతలేమో!

- Advertisement -

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభిషేక్ సింగ్ మన్వీ, బీఆర్ఎస్ సురేష్ రెడ్డి స్థానాలు ఖాళీ కానుండగా ఈరెండు స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇక ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే వెళ్లనుండగా రాజ్యసభ సీటు ఆశీస్తున్న నేతల సంఖ్య గణనీయంగా ఉంది.

అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండగా మిగిలిన ఒక్క స్థానం కోసం పోటీ భారీగా ఉంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున బరిలో నిలిచిన సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే వేం నరేందర్ రెడ్డి, సీనియర్ నేత జీవన్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, కేశవరావు, విహెచ్ (వి. హనుమంతరావు) వంటి నాయకులు కూడా రాజ్యసభ అవకాశాన్ని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ లోపల సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, సీనియారిటీ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. హైకమాండ్ తుది నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ రాజ్యసభ ఎంపికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -