- Advertisement -

శర్వానంద్ ‘భోగి’ ఫస్ట్ లుక్!

- Advertisement -

చార్మింగ్ స్టార్ శర్వానంద్ సంక్రాంతి రేసులో ‘నారి నారి నడుమ మురారి’బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా చేతిలో ఉండగానే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శర్వా. ప్రస్తుతం ‘బైకర్’తో పాటు సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ‘భోగి’ ఫస్ట్ లుక్‌ను రేపు రాత్రి 10:14 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ రగ్గడ్ మాస్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో శర్వానంద్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భోగి’ చిత్రాన్ని 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -