- Advertisement -

దృశ్యం 3 నుండి వెంకీ ఔట్!

- Advertisement -

మలయాళ రీమేక్ మూవీ దృశ్యం సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2 సైతం ఆకట్టుకోగా తాజాగా ‘దృశ్యం 3’ తెరకెక్కుతోంది. దృశ్యం, దృశ్యం 2లో వెంకటేష్ తన నటనతో సినిమాకు మరింత హైప్ తెచ్చారు.

ఇక దృశ్యం 3లో వెంకటేష్ నటిస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘దృశ్యం 3’ తెలుగు రీమేక్‌లో నటించాలని వెంకటేష్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇటీవల రీమేక్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి స్పందన రాకపోవడం, ప్రేక్షకులు రీమేక్‌లపై ఆసక్తి తగ్గించడం వంటి కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మూల మలయాళ చిత్రం Drishyam 3 ఏప్రిల్‌ 2న థియేటర్లలో విడుదల కానుంది. అదేవిధంగా, తెలుగు రీమేక్ ప్రారంభమయ్యేలోపే ఒటీటీలో కూడా అందుబాటులోకి రానుందని సమాచారం. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన తర్వాత వెంకటేష్ కొత్త ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల Chiranjeevi ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మనా శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో విస్తృతమైన అతిథి పాత్రలో కనిపించారు. ‘వెంకీ’ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ప్రస్తుతం వెంకీ .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’లో నటిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -