సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బ్లడీ రోమియో. సినిమా ప్రమోషన్లో భాగంగా టైటీల్ రీవిల్తో పాటు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో నాని తన గత చిత్రాలకంటే పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు.
ఓ గ్యాంగ్‌స్టర్‌గా, కానీ చెఫ్ వేషంలో జీవిస్తున్న వ్యక్తిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. అతను ఈ ప్రయాణంలోకి ఎలా వచ్చాడు? అసలు అతను ఎవరు? అన్నదే కథలో ప్రధానాంశం. టైటిల్ గ్లింప్స్‌లో No. 1 Gangsta అనే లిరికల్ ట్రాక్ వినిపించింది. ఈ పాటను ప్రవీణ్ వేరా స్వరపరచగా, కాయో డ్రిప్ ఆలపించారు.
నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందం తదితర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
