- Advertisement -

మంచి మనసు చాటుకున్ప నాగ‌బాబు!

- Advertisement -

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి కట్టా శ్రీహర్ష వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు,జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని చిన్నారి తండ్రి రామకృష్ణకు సోమవారం హైదరాబాద్‌లో అందజేశారు.

చిన్నసాయం చేసి.. పసి ప్రాణాన్ని కాపాడుదామా అనే శీర్షికతో సోమవారం ప్రచురితమైన వార్తా కథనం ద్వారా చిన్నారి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆ కథనాన్ని చదివిన నాగబాబు వెంటనే స్పందించి, కుటుంబానికి భరోసా కల్పించారు. చిన్నారి చికిత్సకు అవసరమైన మొత్తం భారీగా ఉండటంతో దాతల సహకారం అత్యంత అవసరమని వైద్యులు సూచించారు.

శ్రీహర్ష స్వగ్రామమైన తాటిపూడికి చెందిన పలువురు గ్రామస్తులు కూడా ముందుకు వచ్చి రూ.92 వేల రూపాయలను సేకరించి కుటుంబానికి అందజేశారు. అంతేకాకుండా, ఆ వార్త చదివిన మరో ఇద్దరు దాతలు ఫోన్‌పే ద్వారా రూ.20 వేల రూపాయలు పంపించి తమ మనసున్నతిని చాటుకున్నారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ పలువురు సామాజిక వేత్తలు, స్థానిక నాయకులు కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. వైద్యులు సూచించిన చికిత్స సమయానికి అందితే చిన్నారి కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -