- Advertisement -

లొంగిపోయిన దేవుజీ, మల్ల రాజిరెడ్డి

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలువురు ప్రముఖ మావోయిస్టు నాయకులు స్వచ్ఛందంగా ఆయుధాలు వదిలి పోలీసుల ముందుకు వచ్చారు. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో తిపిరి తిరుపతి అలియాస్ దేవుజీ, మల్ల రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహా రెడ్డి సహా పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్ఐబీ అధికారులు మావోయిస్ట్ చీఫ్ దేవ్ జీతో పాటు మొత్తం 40 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

దీర్ఘకాలంగా అరణ్య ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించిన ఈ నేతలు, ప్రభుత్వ పునరావాస విధానాలు మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సాయుధ పోరాటానికి స్వస్తి పలికినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం వంటి అంశాలు వారికి ప్రధాన ప్రేరణగా నిలిచాయని చెప్పారు.

ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, హింసతో సమస్యలకు పరిష్కారం లభించదని, ప్రజాస్వామ్య మార్గాల్లోనే తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని సూచించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడం రాష్ట్రానికి శుభపరిణామమని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సమాజ శాంతి, అభివృద్ధి దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నామని అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -