- Advertisement -

ఉస్తాద్ భగత్ సింగ్..క్రేజీ అప్‌డేట్!

- Advertisement -

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్‌ సింగ్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇటీవల వరకు ఈ సినిమాకు పెద్దగా ప్రమోషనల్ హైప్ కనిపించలేదు. అయితే ఇటీవల విడుదలైన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రత్యేకంగా They Call Him OG విజయానంతరం అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం రెట్టింపైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు ప్రమోషన్ల వేగాన్ని పెంచారు.

ఇక దర్శకుడు హరీష్‌ శంకర్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఈ సినిమా తమిళ చిత్రం ‘థేరి’ రీమేక్ కాదని స్పష్టం చేశారు. దీంతో చాలా కాలంగా వస్తున్న రూమర్లకు తెరపడింది.

ఈ క్లారిటీతో పాటు పాటకు వచ్చిన స్పందనతో సినిమా హైప్ మరో స్థాయికి చేరింది. పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -