- Advertisement -

వీడియో..గంజాయి మత్తులో కత్తితో యువకుడి దాడి

- Advertisement -

హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి అల్లర్లు చోటుచేసుకున్నాయి. చాదర్‌ఘట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో గంజాయి మత్తులో వేట కొడవళ్ళతో ఆర్బాజ్ అనే యువకుడు హల్చల్ సృష్టించాడు.

సమాచారం ప్రకారం, రెండు నెలల క్రితం చాదర్‌ఘట్ ప్రాంతంలోని ముస్లిం మేటర్నిటీ ఆసుపత్రి సమీపంలో “చచ్చా భాయ్ కే బచ్చే హే హమ్” అంటూ ఒక సెల్‌ఫోన్ షాపులో కొంతమంది యువకులు దౌర్జన్యానికి దిగారు. కేవలం రూ.60 విలువైన స్క్రీన్ గార్డ్ విషయంలో గొడవ పెట్టుకుని, షాపు యజమానిని బెదిరిస్తూ ప్రతి నెలా మామూలు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈరోజు అదే గ్యాంగ్‌కు చెందిన ఆర్బాజ్ మళ్లీ దాడికి దిగాడు. షాపులోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ, నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -