ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ సేవా సంస్థ Rural Development Trust (ఆర్డీటీ)కి కీలక ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ (FCRA) లైసెన్స్ రీన్యూవల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది.
ఈ విజయానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైసీపీ చేసిన దీర్ఘకాల పోరాటం ప్రధాన కారణంగా నిలిచింది. ఆర్డీటీకి అనుమతులు రాకపోవడంతో వేలాది మంది అనాథలు, రైతులు, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్డీటీ కోసం తలారి రంగయ్య పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేపట్టడంతో పాటు ఢిల్లీలో దశలవారీగా ఉద్యమం నిర్వహించారు. పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నేరుగా కలిసి అనంతపురం ప్రజల సమస్యలను వివరించారు. ఈ క్రమంలో జిల్లావాసుల చిరకాల వాంఛ నెరవేరేలా కేంద్రం ఎఫ్సీఆర్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి, ఆర్డీటీకి లభించిన ఎఫ్సీఆర్ఏ అనుమతి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


