- Advertisement -

ఆలయం హుండీలో నకిలీ నోట్లు

- Advertisement -

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం హుండీలో నకిలీ నోట్లు బయటపడటం భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. భక్తులు సమర్పించిన కానుకల మధ్య ‘Childrens Bank’ అని ముద్రించి ఉన్న రూ.100, రూ.200, రూ.500 నకిలీ నోట్లు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హుండీ లెక్కింపు సమయంలో ఆలయ సిబ్బంది ఈ నకిలీ నోట్లు గుర్తించారు. పవిత్రమైన దేవాలయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుండీ లెక్కింపు విధానంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, సీసీటీవీ పర్యవేక్షణను పెంచే దిశగా చర్యలు చేపడతామని వెల్లడించారు.

ఇలాంటి అపచారాలు జరగకుండా ఉండేందుకు భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -