- Advertisement -

ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం

- Advertisement -

కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకు ఐపీఎల్ ప్రారంభానికి ముందు బిగ్ షాక్ తగిలింది. జట్టుకు ఎన్నో విజయాలను అందించిన లెజెండరీ ఆల్‌రౌండర్ అండ్రీ రస్సెల్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు.

రస్సెల్ జట్టు కోసం చేసిన సేవలను గౌరవిస్తూ, ఆయన ధరించిన జెర్సీ నంబర్ 12ను కూడా శాశ్వతంగా రిటైర్ చేస్తున్నట్లు కేకేఆర్ ప్రకటించింది. దీంతో భవిష్యత్తులో ఆ నంబర్ జెర్సీని మరెవ్వరూ ధరించరు.

ఈ నిర్ణయంతో ఐపీఎల్ చరిత్రలో జెర్సీ నంబర్‌ను రిటైర్ చేసిన తొలి ఫ్రాంచైజీగా కేకేఆర్ నిలిచింది. రస్సెల్ తన అద్భుత ఆటతీరుతో కేకేఆర్‌కు ఎన్నో కీలక విజయాలను అందించారు. ముఖ్యంగా తన పేలవమైన బ్యాటింగ్, కీలక వికెట్లతో జట్టును అనేకసార్లు గెలిపించారు.

రస్సెల్ రిటైర్మెంట్ వార్త అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. ఆయన జట్టు కోసం చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. మొత్తంగా, రస్సెల్‌కు కేకేఆర్ ఇచ్చిన ఈ గౌరవం ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -