- Advertisement -

కల్తీ ఐస్‌క్రీం..కల్తీ కొబ్బరి పొడి…షాకింగ్ వివరాలివే!

- Advertisement -

హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా కఠిన చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ మరియు బేగంబజార్ ప్రాంతాల్లో జరిగిన వరుస దాడుల్లో పెద్ద ఎత్తున కల్తీ ఉత్పత్తులు బయటపడ్డాయి.

అత్తాపూర్‌లో “జై భోలేనాథ్” పేరుతో అనుమతులు లేకుండా నడుస్తున్న ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు, నిషేధిత రంగులు ఉపయోగించి ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.అధికారులు కేంద్రాన్ని సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రమాదంలోకి నెట్టే విధంగా ఈ వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదే సమయంలో హైదరాబాద్ బేగంబజార్‌లో మరో భారీ కల్తీ రాకెట్ బయటపడింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి కల్తీ కొబ్బరి పొడి తయారీ యూనిట్‌ను గుర్తించారు.ఈ యూనిట్‌లో కర్ణాటక నుంచి నాసిరకం కొబ్బరి పొడిని తెప్పించి, “చేతక్” బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు తేలింది.

దాడిలో సుమారు 8,300 కిలోల కల్తీ కొబ్బరి పొడి మరియు సంబంధిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకుల మొత్తం విలువ సుమారు రూ.21 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిర్వాహకుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ఈ ఘటనల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రాండెడ్ ఉత్పత్తులు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, లేబుల్స్, అనుమతుల వివరాలు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -