మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. అధికారిక ప్రకటన ప్రకారం, రామ్ చరణ్ స్వల్ప గాయం ఉన్నప్పటికీ ఈరోజు నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఎడమ కంటికి చిన్న గాయం అయినప్పటికీ, షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పని కొనసాగించడం ఆయన నిబద్ధతను చూపిస్తోంది. ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతుండగా బాలీవుడ్ నటి జాహ్నావి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ మొదట మార్చి 27న ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పుడు వాటిని వాయిదా వేశారు. అమెరికా డిస్ట్రిబ్యూటర్ తాజా ప్రకటనలో, ప్రీ-సేల్స్ ఏప్రిల్ 8, 2026 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే వాయిదా కారణంపై స్పష్టత ఇవ్వలేదు.
అలాగే D-Box, Dolby Cinema, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్ల టికెట్లు కూడా అదే రోజు అందుబాటులోకి రానున్నాయి. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు, బొమన్ ఇరానీ, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను అందుకున్నాయి.
రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) మరియు శ్రీరామ నవమి సందర్భంగా ఓ పెద్ద అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశముంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
