- Advertisement -

ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారా..అయితే?

- Advertisement -

ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారా అయితే ఇది మీకోసమే. గర్భధారణ ప్లాన్ చేస్తున్న మహిళలకు తమ ఫర్టిలిటీ స్థితిని ముందుగానే తెలుసుకోవడం ఎంతో కీలకం. ఈ విషయంలో AMH టెస్ట్ (ఆంటి ముల్లేరియన్ హార్మోన్ పరీక్ష) ఒక ముఖ్యమైన పరీక్షగా నిపుణులు సూచిస్తున్నారు.

AMH అంటే ఏమిటి?

AMH అనేది అండాశయాల్లోని చిన్న ఫాలికల్స్ విడుదల చేసే హార్మోన్. ఈ హార్మోన్ స్థాయి ద్వారా మహిళల్లో మిగిలి ఉన్న అండాల సంఖ్య (ఓవేరియన్ రిజర్వ్) గురించి అంచనా వేయవచ్చు.

AMH టెస్ట్ ఎలా చేస్తారు?

ఇది సాధారణ రక్త పరీక్ష (బ్లడ్ టెస్ట్)
మెన్స్ట్రుయల్ సైకిల్‌లో ఎప్పుడైనా చేయవచ్చు
హార్మోన్ స్థాయిలు స్థిరంగా ఉండటం వల్ల ప్రత్యేక రోజులు అవసరం లేదు

అయితే, ఈ టెస్ట్ అండాల సంఖ్యను మాత్రమే చూపిస్తుంది, వాటి నాణ్యతను కాదు.ఈ టెస్ట్ ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వారికి ఉపయోగకరం.
గర్భధారణ ప్లాన్ చేస్తున్న వారు
అసమాన మెన్స్ట్రుయల్ సైకిల్స్ ఉన్న వారు
ఫర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్న వారు
ముందస్తు మెనోపాజ్ అనుమానం ఉన్న వారు
IVF వంటి చికిత్సలు తీసుకోవాలనుకునేవారు చేయించుకోవాలి.

ఫర్టిలిటీపై ప్రభావం చూపే అంశాలు
వయస్సు
జన్యుపరమైన కారణాలు
ధూమపానం
ఆటో ఇమ్యూన్ వ్యాధులు

AMH టెస్ట్ ప్రయోజనాలు

కుటుంబ ప్రణాళికపై సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం
IVF వంటి చికిత్సలను వ్యక్తిగతంగా ప్లాన్ చేయడంలో ఉపయోగం
ముందస్తు మెనోపాజ్ లేదా తక్కువ ఓవేరియన్ రిజర్వ్ గుర్తింపు
ఫర్టిలిటీ స్థితిపై స్పష్టత

ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ల ప్రకారం, సరైన సమయంలో AMH టెస్ట్ చేయించుకోవడం ద్వారా గర్భధారణ అవకాశాలను మెరుగుపరచవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -