అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఒరాకిల్ కంపెనీ చేపట్టిన భారీ లేఆఫ్స్ భారతదేశంలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుమారు 12,000 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం.మార్చి 31 ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపి, వెంటనే ఉద్యోగాలు ముగిసినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా 30,000 మందికి పైగా ఉద్యోగులపై ప్రభావం చూపే రీతిలో తీసుకున్నదిగా తెలుస్తోంది.
ఉద్యోగాలు కోల్పోయిన పలువురు Reddit, Blind వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో తమ అనుభవాలను పంచుకున్నారు. తమ పదవులు తక్షణమే రద్దు చేసినట్లు ఈమెయిల్స్ ద్వారా తెలియజేసినట్లు వారు తెలిపారు.
లేఆఫ్ అయిన ఉద్యోగులకు కంపెనీ ఎగ్జిట్ ప్రాసెస్ వివరాలు అందిస్తోంది.
సెవరెన్స్ ప్యాకేజ్ వివరాలు డాక్యుసైన్ ద్వారా పంపబడతాయి
వ్యక్తిగత ఈమెయిల్ ఇవ్వాలని సూచన
కంపెనీ సిస్టమ్స్ యాక్సెస్ త్వరలో నిలిపివేత
ఇక ఉద్యోగులకు ఉదయమే లేఆఫ్స్‌కు సంబంధించిన సమాచారం అందించింది ఒరాకిల్ కంపెనీ. మీ ఉద్యోగ స్థితి గురించి ఒక కఠినమైన సమాచారం పంచుకోవాల్సి వస్తోంది.కంపెనీ ప్రస్తుత వ్యాపార అవసరాలను పరిగణలోకి తీసుకుని, సంస్థాగత మార్పులలో భాగంగా మీ పదవిని రద్దు చేయాలని నిర్ణయించాము. అందువల్ల, ఈరోజే మీ చివరి పని రోజు.మీరు మా సంస్థకు చేసిన కృషికి ధన్యవాదాలు.
టర్మినేషన్ పేపర్‌వర్క్ పూర్తి చేసిన తర్వాత, నిబంధనల ప్రకారం సెవరెన్స్ ప్యాకేజ్ పొందే అర్హత ఉంటుంది. ఈ వివరాలు డాక్యుసైన్ ద్వారా మీ ఒరాకిల్ ఈమెయిల్‌కు పంపబడతాయి అని తెలిపింది.
ఈ భారీ లేఆఫ్స్ ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్రభావితమవడం గమనార్హం.
