భారత జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ను అధికారికంగా ప్రకటించింది జింబాబ్వే . జూలైలో భారత్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. భారత క్రికెట్ జట్టు మరియు జింబాబ్వే క్రికెట్ జట్టు మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ జూలై 23, 25, 26 తేదీల్లో జరగనుంది. ఈ మ్యాచ్లు అన్నీ హరారేలో నిర్వహించనున్నారు.
భారత్ చివరిసారి 2024లో జింబాబ్వే పర్యటించింది. ఆ సమయంలో శుభ్మన్ గిల్ నాయకత్వంలో యువ జట్టు 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో 4-1 తేడాతో విజయం సాధించింది.
జింబాబ్వే క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మకోని మాట్లాడుతూ…భారత్తో మ్యాచ్లు ఎప్పుడూ భారీ ఆసక్తిని రేకెత్తిస్తాయి. మా ఆటగాళ్లకు ప్రపంచ ఛాంపియన్లతో పోటీ పడే మంచి అవకాశం ఇది అన్నారు. ఇదే సమయంలో, 2027 జనవరిలో జింబాబ్వే జట్టు భారత్ పర్యటనకు రానుంది. బీసీసీఐ ఇప్పటికే ఈ సిరీస్ను ప్రకటించింది.
జనవరి 3 – కోల్కతా
జనవరి 6 – హైదరాబాద్
జనవరి 9 – ముంబై
ఈ మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి.దాదాపు రెండు దశాబ్దాల తర్వాత జింబాబ్వే భారత్లో వన్డే సిరీస్ ఆడనుండటం విశేషంగా భావిస్తున్నారు. ఈ సిరీస్ రెండు దేశాల క్రికెట్ సంబంధాలను మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.
