- Advertisement -

ఇమ్యూనిటీ బూస్టర్లు నిజంగా పనిచేస్తాయా?

- Advertisement -

ఫార్మసీలు, హెల్త్ వెబ్‌సైట్లలో ఎక్కడ చూసినా “ఇమ్యూనిటీ బూస్టర్లు” అనే పేరుతో పౌడర్లు, క్యాప్సూల్స్, టానిక్స్ కనిపిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతుంటాయి. అయితే ఇవి నిజంగా పనిచేస్తాయా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో కలుగుతోంది.

వైద్య నిపుణులు చెప్పిన ప్రకారం, ఇమ్యూనిటీ బూస్టర్లు అనేవి వాస్తవానికి పనిచేయవని తెలిపారు. “ఇవి ఒక ‘మ్యాజిక్ పిల్’ లాంటివి కావు. రోగనిరోధక శక్తిని ఒక్క మాత్రతో పెంచలేం అని చెబుతున్నారు. మన రోజువారీ జీవితంలో అప్రాక్టికల్ విషయాలను నమ్మం కానీ ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం ఈ బూస్టర్లపై సులభంగా నమ్మకం పెడతామని చెబుతున్నారు.

ఏళ్ల తరబడి చెడు జీవనశైలిని అనుసరించిన వ్యక్తి, కొన్ని సప్లిమెంట్లు తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని అనుకోవడం తప్పు .ముఖ్య విషయం ఏమిటంటే —
కొన్ని ప్రత్యేక వ్యాధులకు మాత్రమే ప్రత్యేక ఇమ్యూనోథెరపీ చికిత్సలు ఉంటాయి. కానీ మార్కెట్‌లో అమ్మే సాధారణ “ఇమ్యూనిటీ బూస్టర్లు” వాటితో సమానం కావు.
కోవిడ్ సమయంలో ఈ మార్కెట్ భారీగా పెరిగి ఇప్పుడు బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారిందని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం మీద నియంత్రణ ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో చాలామంది తమ జీవనశైలిని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండటానికి సింపుల్ మార్గం..

సమతుల్య ఆహారం తీసుకోవడం
క్రమం తప్పకుండా వ్యాయామం
సరైన నిద్ర
ఒత్తిడిని నియంత్రించడం
చెడు అలవాట్లకు దూరంగా ఉండడం

అనారోగ్యం వచ్చినప్పుడు:

వైద్యుడిని సంప్రదించాలి
సరైన చికిత్స తీసుకోవాలి
ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి

ఇమ్యూనిటీ బూస్టర్లు అనే పేరుతో అమ్మే సప్లిమెంట్లు ఎక్కువగా మార్కెటింగ్ ట్రిక్ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. నిజమైన ఆరోగ్యం కోసం షార్ట్‌కట్స్ కంటే మంచి జీవనశైలే కీలకం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -