- Advertisement -

3273 రోజుల తర్వాత హాఫ్ సెంచరీ!

- Advertisement -

గుజరాత్ టైటాన్స్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత ప్రదర్శనతో తన దీర్ఘకాల నిరీక్షణకు తెరదీశాడు. ఐపీఎల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సుందర్ 32 బంతుల్లో 55 పరుగులు చేసి తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో సుమారు 9 సంవత్సరాల (3273 రోజుల) నిరీక్షణకు ముగింపు పలికాడు.

ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ 6 ఫోర్లు, 2 సిక్సర్లతో వేగంగా పరుగులు సాధించి జట్టు స్కోర్‌ను 210/4కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.ఇది సుందర్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి 50+ స్కోర్ కావడం విశేషం. గత సీజన్‌లో 48, 49 పరుగుల వద్ద ఆగిపోయిన సుందర్, ఈసారి ఆ అడ్డంకిని దాటి హాఫ్ సెంచరీ సాధించాడు.

న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఒక పరుగుతో విజయం సాధించింది. గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్, బట్లర్, సుందర్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

భారీ టార్గెట్ ఛేదనలో కేఎల్ రాహుల్ 52 బంతుల్లో 92 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. చివర్లో మిల్లర్‌ 41 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్‌ను ముగించలేకపోయాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒక పరుగుతో ఓడిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -